మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తో రిలీజ్ కు రెడీగా ఉన్న మెగా హీరో.. నెక్ట్స్ సినిమాల పై కూడా క్లారిటీతో ఉన్నాడు.
రామ్ చరణ్ దూకుడు మామూలుగా లేదు. ఆయన ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ తో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఈ నెల 25న ట్రిపుల్ ఆర్ ప్రరపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో చరణ్ రేంజ్ మారిపోబోతోంది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. చరణ్ ఈ హాడావిడిలో బిజీగా ఉన్నాడు.
ఇక ట్రిపుల్ ఆర్ తరువాత జోరు పెంచబోతున్నాడు చరణ్. ఇప్పటికే రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం త్యాగం చేసిన మెగా హీరో..తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ కూడా రెండు షెడ్యూల్స్ కప్లీట్ అయ్యంది. ఈ సినిమా నడుస్తుండగానే చరణ్, ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ సమ్మర్ తరువాత స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నయి.
వాటితో పాటు మరికొంత మంది డైరెక్టర్ల చరణ్ చుట్టూ తిరుగుతున్నారు. వారికథలను వింటూ కొంత మందిని హోల్డ్ లో పెట్డాడు చరణ్. మరికొంత మందికి ఇన్ డైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్టు తెలుస్తోంది. ఇక రచరణ్ తో సినిమ చేయాలని చూస్తున్న డైరెక్టర్ల లిస్ట్ లో తమిళ స్టార్ డైరేక్టర్ కమ్ యాక్టర్ సముద్ర ఖని కూడా ఉన్నారు.ఈయన తమిళ్, తెలుగులో యాక్టర్ గా మరియు డైరెక్టర్ గా అందరికి సుపరిచితుడే. మల్టీ టాలెంట్ కలిగిన ఈ కోలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే చరణ్ కి సముద్రఖని ఒక మంచి కథను వినిపించినట్టుగా తెలుస్తోంది. సముద్రఖని మంచి రచయిత ,నటుడు, దర్శకుడు తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన వినోదయా సితం తెలుగు రీమేక్ లో చేయడానికి ఆయన పవన్ కల్యాణ్ ను ఒప్పించాడు. ఈసినిమా త్వరలో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఇక మరో కథ కూడా ఆయన రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు సముద్రఖని మరో కథను చరణ్ కి వినిపించాడట. సముద్ర ఖని చెప్పిన కథ కొత్తగా ఉండటంతో, చరణ్ ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. ప్రస్తుతం సముద్రఖని పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు.