గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాంచరణ్ వైరల్ పిక్.. హాలీవుడ్ యాక్షన్ హీరోని తలపించేలా.. 

Published : Sep 04, 2022, 03:36 PM IST
గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాంచరణ్ వైరల్ పిక్.. హాలీవుడ్ యాక్షన్ హీరోని తలపించేలా.. 

సారాంశం

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజ్ పాన్ ఇండియా వ్యాప్తంగా వ్యాపించింది. రాంచరణ్ స్టైల్, లుక్స్ నార్త్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజ్ పాన్ ఇండియా వ్యాప్తంగా వ్యాపించింది. రాంచరణ్ స్టైల్, లుక్స్ నార్త్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ కి సంబంధించిన ఏ అంశం అయినా నార్త్ లో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. RC 15 నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. 

తాజాగా రాంచరణ్ లేటెస్ట్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. రాంచరణ్ సూట్ ధరించిన హెలికాఫ్టర్ లో నుంచి దిగుతున్న పిక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. రాంచరణ్ గాగుల్స్ ధరించి యమా స్టైల్ గా కనిపిస్తున్నాడు. 

ఓ యాడ్ షూట్ లో భాగంగా చరణ్ ఇలా హెలికాఫ్టర్ లో మెరిసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ కొత్త బియర్డ్ కూడా ఆకట్టుకుంటోంది, ఈ పిక్ లో రాంచరణ్ ని చూసిన నెటిజన్లు హాలీవుడ్ కి హీరోకి ఏమాత్రం తక్కువ కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఆ మధ్యన హాలీవుడ్ రచయిత కూకర్.. రాంచరణ్ జేమ్స్ బాండ్ హీరోగా సూట్ అవుతాడు అంటూ కామెంట్స్ చేశారు. ఆ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ పెర్ఫామెన్స్ చూసిన తర్వాత కూకర్ ఆ కామెంట్స్ చేశారు. 

ఇదిలా ఉండగా శంకర్ మూవీ తర్వాత రాంచరణ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ లో నటించాల్సి ఉంది. కానీ ఆ చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కూడా రాంచరణ్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?