బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... కీలక ఎపిసోడ్ కి ముందే కంటెస్టెంట్ లిస్ట్ లీక్!

By Sambi ReddyFirst Published Sep 4, 2022, 2:06 PM IST
Highlights


బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో ప్రసారం కానుంది. అయితే లేటెస్ట్ ప్రోమోలో కంటెస్టెంట్ లిస్ట్ నాగార్జున చూచాయిగా లీక్ చేశాడు. 
 

బిగ్ బాస్ షో నిబంధనలు మనకు తెలిసిందే. లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరనేది టాప్ సీక్రెట్ . కాకపోతే ముందుగానే చాలా వరకు కంటెస్టెంట్స్ గురించి తెలుస్తుంది. కరోనా ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ కి ఎంపికైన వారిని రెండు వారాలు క్వారంటైన్ చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మాత్రమే హౌస్ లోకి పంపిస్తారు. మరి రెండు వారాలు ఓ సెలెబ్రిటీ కనిపించకపోతే దానర్థం అతడు బిగ్ బాస్ షోకి ఎంపికైనట్లే. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ పూర్తి లిస్ట్ లీకైంది. అయినప్పటికీ ఎపిసోడ్ ప్రసారం వరకు మనం కచ్చితంగా చెప్పలేం. 

అయితే లేటెస్ట్ ప్రోమోతో మేకర్స్ ఒకరిద్దరు కంటెస్టెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. అందులో ఒకరు చలాకీ చంటి. జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ ప్రోమోతో పూర్తి క్లారిటీ వచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉండే చలాకీ చంటి వాయిస్ ఆడియన్స్ గుర్తు పట్టేశారు. అలాగే ఆయన రాజు గెటప్ లో రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. 

ఈ ప్రోమోలో ద్వారా మరో కంటెస్టెంట్ సింగర్ రేవంత్ ఎంట్రీపై కూడా క్లారిటీ వచ్చింది. రేవంత్ ని అస్పష్టంగా చూపించినప్పటికీ ఆయన వాయిస్ ఈజీగా గుర్తు పట్టేదిగా ఉంది. చలాకీ చంటి, సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనడం ఖాయమైంది. వీరితో పాటు యూట్యూబర్ ఆదిరెడ్డి, బుల్లితెర నటులు రియల్ లైఫ్ కపుల్ రోహిత్ -మరీనా, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ సుదీప, యూట్యూబర్ గీతురాయల్ , నటుడు బాల ఆదిత్య, నటుడు ఆర్జే సూర్య, నాటి వాసంతి, నటి సుల్తానా, జబర్దస్త్ ఫైమా, యాంకర్ ఆరోహి, యూట్యూబర్ శ్రీహాన్, నటి శ్రీసత్య, నటుడు అర్జున్ కళ్యాణ్, నటి కీర్తి భట్, యాంకర్ నేహా చౌదరి, నటుడు సుహాన్ని సల్మాన్, నటి అభినయ, మోడల్ రాజా శేఖర్ పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లనున్నారట. 

click me!