పవన్ కొత్త మూవీతో భలే ఎగ్జైట్ అయిన రాంచరణ్.. అదిరిపోయే కామెంట్ వైరల్

Published : Dec 05, 2022, 11:36 AM IST
పవన్ కొత్త మూవీతో భలే ఎగ్జైట్ అయిన రాంచరణ్.. అదిరిపోయే కామెంట్ వైరల్

సారాంశం

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్, సుజీత్ ల చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. అయితే భవదీయుడు చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంతలోనే పవన్ కొత్త మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చి అందరిని థ్రిల్ చేసింది. 

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్, సుజీత్ ల చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు. ఈ సూపర్ అప్డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది.   

పోస్టర్ లో ఉన్న విశేషాలు అభిమానులని థ్రిల్ చేస్తున్నాయి. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్, ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర అనౌన్స్ మెంట్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఎగ్జైట్ అయ్యాడు. పవన్, సుజీత్ కొత్త చిత్రం గురించి ట్వీట్ చేశాడు. 

'పవన్ కళ్యాణ్ గారు, సుజీత్.. వాట్ ఈ కాంబినేషన్.. ఫస్ట్ లుక్ అదిరింది. డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థకి, డీవోపీ రవిచంద్రన్ కి ఆల్ ది బెస్ట్' అని రాంచరణ్ ట్వీట్ చేశారు. సాహో తర్వాత సుజీత్, ఆర్ఆర్ఆర్ తర్వాత నిర్మాత దానయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sreemukhi: అక్కా తనూజ, కళ్యాణ్‌ని కలపండి.. శ్రీముఖికి నెటిజన్ల క్రేజీ రిక్వెస్ట్ లు.. డోస్‌ తగ్గించడంపై ఆందోళన
Jabardasth Naresh: ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు, పెళ్లై పిల్లలు పుడితే చాలు.. జబర్దస్త్ నరేష్‌ ఆవేదన