#MaheshBabu:మహేష్ సినిమా కోసం...టాప్ హాలీవుడ్ స్టూడియో కొలాబిరేషన్

Published : Dec 05, 2022, 10:57 AM IST
 #MaheshBabu:మహేష్ సినిమా కోసం...టాప్ హాలీవుడ్ స్టూడియో కొలాబిరేషన్

సారాంశం

మహేష్ సినిమాకు ఇలా హాలీవుడ్ సంస్దతో టై అప్ తొలిసారి కావటంతో ఫ్యాన్స్ ఆనందానికి అంతేలేదు. అయితే ఏ సంస్ద అనేది క్లారిటీ లేదు. సోనీ లేదా డిస్నీ ఉండే అవకాసం ఉందంటున్నారు.   

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తో ఈ సారి ఖచ్చితంగా టాలీవుడ్  ప్రిన్స్ మహేష్ బాబు సినిమా చేయనున్నారు. ఎప్పటినుంచో వీరిద్దరూ కలిసి మూవీ చేయాలని అనుకుంటున్నారు. కానీ కుదరడం లేదు. మహేష్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్‌ కోరిక త్వరలో తీరనుంది.  ఈ విషయాన్ని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. మరో ప్రక్క ఈ సినిమా కోసం పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు టాప్ హాలీవుడ్ స్టూడియోతో టై అప్ కాబోతున్నట్లు సమాచారం. 

ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయటం కోసం..ఇతర దేశాల్లో షూటింగ్ లొకేషన్స్ కోసం హాలీవుడ్ స్టూడియోతో టై అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ స్టూడియో వారు ఈ సినిమాని ప్రెజెంట్ చేయటంతో పాటు డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ చేస్తారు. దాదాపుగా కలిసి పనిచేస్తారన్నమాట. మహేష్ సినిమాకు ఇలా హాలీవుడ్ సంస్దతో టై అప్ తొలిసారి కావటంతో ఫ్యాన్స్ ఆనందానికి అంతేలేదు. అయితే ఏ సంస్ద అనేది క్లారిటీ లేదు. సోనీ లేదా డిస్నీ ఉండే అవకాసం ఉందంటున్నారు. 
 
మరో ప్రక్క రాజమౌళితో పనిచేయాలనే కల నెరవేరబోతున్నందకు సంతోషంగా ఉన్నానని మహేశ్ బాబు తెలిపాడు. "అతనితో కలిసి పని చేయడం అంటే నా కల నిజం కావడంలాంటిదే. రాజమౌళితో సినిమా చేయడం అంటే ఒకేసారి 25 మూవీస్‌ చేయడంలాంటిదే. అది శారీరకంగా కాస్త ఎక్కుడ డిమాండ్‌ చేసే మూవీయే. దీనిపై నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఇది పాన్‌ ఇండియా మూవీ. అన్ని అడ్డంకులను అధిగమించి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మా సినిమా అందిస్తాం"  అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. 

రాజమౌళి, మహేశ్ బాబు సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఆఫ్రికా అడవి నేపథ్యంలో కథ కొనసాగనుంది.. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత విల్‌బుర్‌ స్మిత్‌ నవల ఆధారంగా కథను అందిస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే నవలలను చదివేశారని తెలిపారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే ఓ అడ్వెంచరస్‌ ఇతి వృత్తంతో ఈ సినిమా ఉండనుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా ఆఫ్రికన్‌ అడవుల్లో జరగుందని సమాచారం. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్