చిరుతను ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్న ''చిరుత''

Published : May 30, 2019, 03:28 PM ISTUpdated : May 30, 2019, 03:37 PM IST
చిరుతను ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్న ''చిరుత''

సారాంశం

రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి  ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలో పర్యటిస్తున్నారు. 

రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి  ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో సఫారీ చేస్తున్నారు. అక్కడ వన్యమృగాలు నడియాడే చోట వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తో సేదతీరుతున్నారు. 

ఇందుకోసం ప్రత్యేకంగా ఈ జంట ఒక జీప్ లో విహరాహానికి ప్లాన్ చేశారు. రామ్ చరణ్ తనకు కొద్ది  దూరంలో ఉన్న చిరుతను ఫోటోలు తీస్తున్నాడు. అయితే హఠాత్తుగా ఈ జంట ఈ పోగ్రామ్ పెట్టుకోవటానికి కారణం ఏమిటీ అంటారా...ఉంది..అదే వెడ్డింగ్ ఏనవర్శిరీ.

జూన్ 14న చరణ్- ఉపాసన జంట ఏడవ వెడ్డింగ్ యానివర్శరీ కావటంతో ఇలా ప్లాన్ చేసారు. అదేంటి ఇంకా పద్నాలుగు రోజులు ఉంది కదా అంటారా... ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్స్ వల్ల ఆ టైమ్ లో ఫుల్ బిజీ.  సెలబ్రేషన్స్ కు సమయం ఉండదు. అందుకే కాస్తంత ముందుగానే ఇలా ఉపాసనతో కలిసి చరణ్ ట్రిప్ వెళ్లారని సమాచారం.

ఇక ఈ ట్రిప్ వివరాలు , ఫొటోలు మనకెలా వచ్చాయా అంటారా..చెర్రీ భార్య ఉపాసన ట్వీట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి టాంజానియాతో పాటు కిలిమంజారో, సెరోనెరాలో కూడా పర్యటించనున్నారని తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..