వెంకటేష్ పెద్ద కూతురికి పెళ్లి.. డేట్ ఫిక్స్?

Published : Nov 05, 2018, 04:29 PM IST
వెంకటేష్ పెద్ద కూతురికి పెళ్లి.. డేట్ ఫిక్స్?

సారాంశం

చాలా కాలం తరువాత దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెంకటేష్ పెద్ద కూతురి ఆశ్రిత వివాహం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

చాలా కాలం తరువాత దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెంకటేష్ పెద్ద కూతురి ఆశ్రిత వివాహం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో ఆశ్రిత కు జాతకం కుదిరిందని వివాహంకు సంబందించిన దాదాపు మాట ముచ్చట అయిపోయిందని టాక్ వచ్చింది. 

అసలైతే సెప్టెంబర్ లోనే వివాహం నిశ్చయమైందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా ఇరు కుటుంబాల సన్నిహితుల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం నవంబర్ 24న పెళ్లికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి కొడుకు గురించి ఎలాంటి విషయాన్నీ కుటుంబ సభ్యులు బయటపెట్టడం లేదు. 

అయితే వరుడి కుటుంబ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువులు అన్నట్లు తెలుస్తోంది. సినిమా ఫీల్డ్, బిజినెస్ అండ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో ఇరు కుటుంబాల నుంచి ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ గేమ్ ఓవర్.. 13వ రోజు ప్రభాస్ సినిమా షాకింగ్ వసూళ్లు
నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?