మా పాపకు మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి.. మొదటిసారి మీడియా ముందుకు రామ్ చరణ్, ఉపాసన

By Asianet News  |  First Published Jun 23, 2023, 2:48 PM IST

కొణిదెల వారి ఇంటికి మెగా ప్రిన్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ - ఉపాసన మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. అందరికీ థ్యాంక్యూ చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 


ఈనెల 20న ఉదయం మెగా ఫ్యామిలీ ఇంట మహాలక్ష్మి జన్మించిన విషయం తెలిసిందే. దీంతో కొణిదెల వారింట సంతోషం విరజిల్లింది. ఉపాపన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి తన మనవరాలి రాకతో పట్టలేని ఆనందంలో మునిగితేలుతున్నారు. పాప పుట్టడంతోనే ‘మెగా ప్రిన్స్’ అంటూ నామాకరణం కూడా చేశారు. 

నిన్నటి వరకు అపోలో ఆస్ప్రతిలోనే ఉన్న ఉపాపన నేడు చిరంజీవి ఇంటికి పాపతో కలిసి చేరుకున్నారు. దీంతో కొణిదెల వారింట పండుగ వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే తొలిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  మీడియా ముందుకు ఉపాసన, కూతరు మెగా ప్రిన్స్ తో కలిసి వచ్చారు.  తన పాప గురించి మాట్లాడారు. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చరణ్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, మెగా ఫ్యాన్స్  బ్లెస్సింగ్స్ మా పాపకు అందాయి. ఇందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా తమ పాప పట్ల ఆనందం వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది.

Latest Videos

మా పాపకు ఎప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. పాప పుట్టిన క్షణం నేను మాటల్లో చెప్పలేని ఆనందం. ఇన్నాళ్లు దేవుడు మాకు పండంటి బిడ్డను ప్రసాదించడం ఆనందంగా ఉంది. పాపను అందరూ ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. త్వరలో పాపకు నామకరణం కూడా చేస్తాం. నాకు పెద్దగా సంప్రదాయాలు తెలియవు. 13వ రోజున, లేదంటే 21వ రోజున పాపకు ఏం పేరు పెట్టబోతున్నామనేది స్వయంగా వెల్లడిస్తాం. ఇప్పటికే ఓ పేరు కూడా ఉపాసన నేను ఎంపిక చేశామంటూ చెర్రీ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంబురంలో మునిగి తేలుతోంది. రామ్ చరణ్ - ఉపాసన  తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు, శ్రేయోభిలాషులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక చిరు కుటుంబీకులకు ట్రీట్ కూడా ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా ప్రిన్స్ ఆస్ప్రతిలో ఉండగానే మెగా ఫ్యామిలీ, అల్లు అల్లు అర్జున్ వచ్చి చూశారు. పాపను ఆశీర్వదించి చెర్రీ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 

ఇక చరణ్ తనకు పాప పుట్టడంతో తన బిజీ షెడ్యూల్ ను కాస్తా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. షూటింగ్స్ అన్నీ ఆపేసి ఉపాసన, తన కూతురుతోనే గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారంట. ఆగస్టు వరకు షూటింగ్ కు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న Game Changerలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

click me!