బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా (Neena Gupta) తాజాగా ‘లస్ట్ స్టోరీ 2’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ట్రైలర్ బోల్డ్ కంటెంట్ తో వచ్చి సెన్సేషన్ గా మారింది. దీనిపై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా కొన్నేళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూనే వస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. కాగా, తాజాగా నీనా గుప్తా కీలక పాత్ర పోషించిన ‘లస్ట్ స్టోరీస్2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా యూనిట్ వదిలింది.
లేటెస్ట్ ట్రైలర్ సెన్సేషన్ గా మారింది. ఓటీటీ వేదికన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ తో అందరి చూపును తిప్పుకుంది. ప్రధాన ఈ సిరీస్ మొదటి భాగంలో మహిళలు తమ కోరికలను ఎలా తీర్చు కున్నారనే అంశంపై తెరకెక్కించారు. అప్పుడు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం సీజన్ 2తో రాబోతున్నారు. ఈ నెల 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కనిపించింది. శృంగార సన్నివేశాలు కనిపించాయి. ట్రైలర్ చూశాక అందరూ షాక్ అవుతున్నారు. ఈ సిరీస్ లో నటించిన నటి నీనా గుప్తా ఇదే అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ‘శృంగారం గురించి యువత తెలుసుకోవాలి. నేను కాలేజీకి వెళ్లే రోజుల్లో ముద్దు పెట్టుకుంటే గర్భం దాల్చుతారనే నమ్మకం ఉండేది. మా అమ్మ చాలా కఠినంగా ఉంటుంది. దాంతో నాకు 13 ఏళ్లు వచ్చే వరకు శృంగారం గురించి ఏమీ తెలియదు.
ఇలాంటి విషయాలు అప్పట్లో తల్లులు కూడా చెప్పడానికి భయపడేవారు. కానీ, పూర్వం పెళ్లికి ముందు మాత్రం శృంగారంపై అమ్మాయికి, అబ్బాయికి కొన్ని విషయాలు చెప్పేవారు. వారి మొదటి రాత్రి ఎలాంటి గొడవలు జరగకూడదని, వారి బంధం బలపడాలని అలా చెప్పే వారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి విషయాలు మారలేదు. అందుకే Lust Storie 2 సిరీస్ లో శృంగార సన్నివేశాలను చూపించారు. అందులో తప్పేమీ లేదని నా అభిప్రాయం. అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో నీనా గుప్తా కామెంట్లు వైరల్ గా మారాయి.
ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’లో నీనా గుప్తా ‘డాడీ మా’ పాత్రలో నటించారు. అలాగే సీనియర్ నటి కాజోలో, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. బాల్కీ, రవీంద్రనాథ్, సుజోయ్, సేన్ శర్శ దర్శకత్వం వహించారు. వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.