మరోసారి లాంగ్ హెయిర్? ప్రాజెక్ట్ కే మూవీలో ప్రభాస్ లుక్ అలా ఉంటుందా?

Published : Jun 23, 2023, 01:26 PM IST
మరోసారి లాంగ్ హెయిర్? ప్రాజెక్ట్ కే మూవీలో ప్రభాస్ లుక్ అలా ఉంటుందా?

సారాంశం

ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇది పాన్ వరల్డ్ మూవీ అని ప్రకటించారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ పై ఆసక్తికర సమాచారం అందుతుంది.   

ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ప్రాజెక్ట్ కే. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర కథ, జానర్ పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. స్పష్టమైన సమాచారం లేదు. ప్రముఖంగా సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చారని. లార్డ్ కృష్ణ ప్రస్తావనతో కూడిన సోషియో ఫాంటసీ చిత్రమని ఆ మధ్య నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీ దత్... ప్రాజెక్ట్ కే మూవీలో లార్డ్ విష్ణు, ఫాంటసీ అంశాలు ఉంటాయి. అయితే సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అన్నారు. 

కాబట్టి ఈ మూవీలో లార్డ్ విష్ణు ప్రస్తావన ఉంటుందనిపిస్తుంది. అశ్వినీ దత్ ఫాంటసీ అంటున్నారు కాబట్టి ఇది సూపర్ హీరో మూవీ కూడా కావచ్చంటున్నారు. ఇంత పెద్ద సోసియో ఫాంటసీ యాక్షన్ మూవీలో ఆ సెంటిమెంట్ కోణం ఏమిటనేది ఆసక్తికరం. ఇక ప్రాజెక్ట్ కే లో సైన్స్ అంశాలతో కూడా కూడిన వండర్స్.  పురాణాలు, దేవుళ్ళ ప్రస్తావన కూడా ఉందనిపిస్తుంది.

అలాగే ప్రభాస్ సూపర్ హీరోనా? కాదా? అనే విషయంలో క్లారిటీ లేదు. నాగ్ అశ్విన్ మాత్రం ఇదో లార్జర్ దేన్ లైఫ్ మూవీ. పాన్ వరల్డ్ చిత్రమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ప్రభాస్ ని లాంగ్ హెయిర్ తో నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేయబోతున్నాడట. బాహుబలి సిరీస్ తో పాటు ఆదిపురుష్ మూవీలో రాఘవుడిగా ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపించారు. ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ మరోసారి లాంగ్ హెయిర్ ట్రై చేస్తున్నారనే చర్చ నడుస్తుంది.  అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

ఇంత వరకు ప్రభాస్ లుక్ పై ఎలాంటి హింట్ లేదు. అక్టోబర్ నెలలో ప్రభాస్ బర్త్ డే కాగా ప్రాజెక్ట్ కే నుండి ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం కలదు. అప్పుడు దీనిపై పూర్తి స్పష్టత రానుంది.  కాగా ప్రాజెక్ట్ కే విడుదల తేదీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. దిశా పటాని సెకండ్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం