
రామ్ చరణ్, కమల్ హాసన్ వీళ్లిద్దరూ ఒకే సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారా అంటే అవుననే వినపడుతోంది. అయితే వీళ్లిద్దరు ఒకే ఫ్రేమ్ లో కనపడరట.వేర్వేరు సీన్స్ లో కనపడతారని తమిళ మీడియా అంటోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనే విషయం ప్రక్కన పెడితే క్రేజీగా న్యూస్ ఉందనేది మాత్రం నిజం. ఇంతకీ ఏ సినిమాలో వీళ్లద్దరూ కనపడబోతున్నారు అంటే...
విజయ్ హీరోగా రూపొందుతున్న ‘లియో’లో కమల్ హాసన్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. అదే సిరీస్‌లో ఇప్పుడు ‘లియో’ తీస్తున్నాడు. అందుకే ‘విక్రమ్’ గెటప్‌లో కమల్ ఇందులో కనిపించబోతున్నారట. ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ ఈ విషయంలో ఓ హింట్ ఇచ్చాడు.
కమల్ పేరు డైరక్ట్ గా రివీల్ చేయనప్పటికీ ఒక గద్ద ఫోటో పెట్టి ‘ఈగల్ ఈజ్ కమింగ్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరిగ్గా ఇలాంటిదే ‘విక్రమ్’ సినిమాలోని థీమ్ సాంగ్‌లో కనిపిస్తుంది. పైగా ఈ పోస్ట్‌లో ట్రయాంగిల్ రెడ్ ఎమోజీని కూడా షేర్ చేశాడు. ఇది ‘విక్రమ్’ క్లైమాక్స్‌లోని ‘కోడ్ రెడ్’ని గుర్తు చేస్తోంది. దీంతో ‘లియో’లో కమల్ నటించడం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది.
మరో ప్రక్క ఈ భారీ ప్రాజెక్ట్‌లో రాంచరణ్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హీరో విజయ్.. చరణ్, లోకేశ్ డిన్నర్‌కి ఇన్వైట్ చేసినట్టుగా సమాచారం. దీంతో లియోలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే టాక్ వచ్చింది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే.
ఇక తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం, విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.