Official:నిహారికకు విడాకులు మంజూరు

Published : Jul 05, 2023, 08:08 AM IST
 Official:నిహారికకు విడాకులు మంజూరు

సారాంశం

ప్రస్తుతం నాగబాబు ఇంట్లో నిహారిక అన్నయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే.. చెల్లికి విడాకుల వార్త కొంచెం ఇబ్బందికరమే.


నాగబాబు కుమార్తె, నటి నిహారిక, మాజీ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు జె.వి.చైతన్యలకు కూకట్‌పల్లిలోని కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. మే 19 న వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 5న విడాకులు మంజూరయ్యాయి. అయితే విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. 

నిహారిక, చైతన్యలకు 2020 డిసెంబరు 9న రాజస్థాన్‌లో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. 
ఆ విషయం గత కొన్ని రోజులుగా నిహారిక విడాకుల వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలో ఫొటోలు డిలేట్  చేయటంతో చాలా మంది ఈ విషయం నిజమే అన్నారు. అలాగే ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లోనూ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త చైతన్య కనిపించలేదు. కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కూడా హాజరుకావటం లేదు. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరిగినా.. అధికారికంగా ఎక్కడా.. ఎవరూ స్పందించలేదు.

ఈ క్రమంలోనే.. జులై 4వ తేదీన.. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక విడాకుల దరఖాస్తు బయటకు రావటం సంచలనంగా మారింది. తాజాగా విడాకులు మంజూరైనట్లు తెలియడంతో ఊహాగానాలకు తెరపడింది. ఏదైమైనా ప్రస్తుతం నాగబాబు ఇంట్లో నిహారిక అన్నయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే.. చెల్లికి విడాకుల వార్త కొంచెం ఇబ్బందికరమే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?