రాంచరణ్ ప్లాన్ కు హీరోలంతా ఒప్పుకుంటారా!

Published : Nov 28, 2019, 02:54 PM ISTUpdated : Nov 28, 2019, 02:57 PM IST
రాంచరణ్ ప్లాన్ కు హీరోలంతా ఒప్పుకుంటారా!

సారాంశం

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చరణ్ టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చరణ్ టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా రాంచరణ్ టాలీవుడ్ హీరోలతో పార్టీలు, ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. అందరి హీరోలతో చరణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అక్కినేని ఫ్యామిలీ, రానా ఇలా అందరితో రాంచరణ్ కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 80వ దశకం హీరో హీరోయిన్లతో రీయూనియన్ పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో రాంచరణ్ కూడా పాల్గొన్నాడు. తన తండ్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీ తర్వాత చరణ్ కు కూడా ఓ ఆలోచన వచ్చిందట. ఈ తరం హీరోలని, హీరోయిన్లని ఒకే వేదికపైకి చేర్చే కార్యక్రమం ఏదైనా ప్లాన్ చేయాలని చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కాజల్ అగర్వాల్ రేర్ ఫీట్.. అతడి తండ్రితో రొమాన్స్!

ఇందుకోసం ఈ తరం సౌత్ ఇండియన్ స్టార్స్ అందరితో చరణ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చరణ్ భావిస్తున్నాడు. రాంచరణ్ ప్రతిపాదనకు హీరోలంతా అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. 

చిరంజీవి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో 80వ దశకానికి చెందిన నాగార్జున, వెంకటేష్, రాధికా, సుమన్, నరేష్, ఖుష్బూ, సుహాసిని, రాధా, భాను చందర్ లాంటి నటులు 40 మంది వరకు హాజరయ్యారు. ఈ పార్టీలో నటులంతా సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ అనుసరించారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌