పవన్ స్పీచ్ పై రామ్ చరణ్ కామెంట్స్!

Published : Dec 18, 2018, 01:41 PM IST
పవన్ స్పీచ్ పై రామ్ చరణ్ కామెంట్స్!

సారాంశం

జనసేన ప్రవాస గర్జనలో భాగంగా పవన్ కళ్యాణ్ అమెరికాలోని డల్లాస్ సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పవన్ అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. 

జనసేన ప్రవాస గర్జనలో భాగంగా పవన్ కళ్యాణ్ అమెరికాలోని డల్లాస్ సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పవన్ అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదని రోజు భయాన్ని ఎదుర్కోవడమేనని అన్నారు. తన పాతికేళ్ల జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు అందుకే రాజకీయ పార్టీని స్థాపించినట్లు తెలిపారు.

పవన్ మాటలపై తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ''ప్రతీ రోజు భయాన్ని అధిగమిస్తూ ముందుకు సాగాలి. భయంలోని మార్పుని ఎదుర్కోలేకపోవటమే పెద్ద భయం. ఇప్పటివరకు నేను విన్న ది బెస్ట్ ప్రేరణాత్మక ప్రసంగం ఇదే. పవన్ కళ్యాణ్.. ది మ్యాన్, ది లీడర్, ది విజనరీ'' అని పోస్ట్ లో పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి