ఫస్ట్ లుక్: 'సూర్యకాంతం'గా నీహారిక!

Published : Dec 18, 2018, 12:51 PM IST
ఫస్ట్ లుక్: 'సూర్యకాంతం'గా నీహారిక!

సారాంశం

'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మెగాడాటర్ నీహారిక సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇటీవల సుమంత్ అశ్విన్ హీరోగా 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించింది. 

'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మెగాడాటర్ నీహారిక సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇటీవల సుమంత్ అశ్విన్ హీరోగా 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించింది. అది కూడా నీహారికని నిరాశ పరిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కొత్త దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో 'సూర్యకాంతం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ కి జోడీగా నీహారిక కనిపించనుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో నీహారిక రెండు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఈరోజు నీహారిక పుట్టినరోజు కానుకగా వరుణ్ తేజ్ ఈ పోస్టర్ ని విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని నిర్వాణ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే
కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు