Puneet Rajkumar Fan Death: జేమ్స్ సినిమా చూస్తూ.. ఆగిపోయిన పునిత్ రాజ్ కుమార్ అభిమాని గుండె

Published : Mar 19, 2022, 10:52 AM IST
Puneet Rajkumar Fan Death: జేమ్స్ సినిమా చూస్తూ.. ఆగిపోయిన పునిత్ రాజ్ కుమార్ అభిమాని గుండె

సారాంశం

కన్నడ పవర్ స్టార్ పునిత్ మరణించి నాలుగు నెలలు అవుతుంది. అభిమానులు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో మంది అభిమానులకు గుండె కోతను మిగిల్చి వెళ్లిపోయారు పునిత్. రీసెంట్ గా పునిత్ అభిమాని ఒకరు గుండెపోటుతో మరణించారు. 

న్నడ పవర్ స్టార్ పునిత్ మరణించి నాలుగు నెలలు అవుతుంది. అభిమానులు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో మంది అభిమానులకు గుండె కోతను మిగిల్చి వెళ్లిపోయారు పునిత్. రీసెంట్ గా పునిత్ అభిమాని ఒకరు గుండెపోటుతో మరణించారు. 

కన్నడ పవర్  స్టార్ హీరో పునీత్ కుమార్ మరణించి నాలుగు నెలలు పైనే అవుతుంది. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది అభిమానులు బాధలోమునిగిపోయారు. ఇప్పటికే ఆయన అభిమానులు ఆ విషయాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి చెంది నాలుగు నెలలు గడిచిపోయినా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. 

46 ఏళ్ల చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఈవార్తతో కన్నడ సినీ పరిశ్రమ అల్లకల్లోలం అయ్యింది. అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్,బాలయ్య,చిరు,లాంటి స్టార్స్ కూడా పునిత్ ను చూసి కంటతడి పెట్టుకున్నారంటే.. పునిత్ మరణం ఎంత మందిని బాధపెట్టిందో అర్ధమౌతుంది.  

ఇక అభిమానులు ఇప్పటికీ పునిత్ మరణం నుంచ బయట పడలేకపోతున్నారు. రీసెంట్ గా పునిత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. పునిత్ రాజ్ కుమార్ కు ఘనంగా నివాళి అర్పించాలని...కన్నడ నాట అన్ని థియేటర్లలో వారానికి పైగా జేమ్స్ మూవీని నడిపించేలా ప్లాన్ చేశారట. ఇక జేమ్స్ మూవీ రిలీజ్ సంబరాల్లో అభిమానులు హడావిడి చేస్తున్నారు. 

ఇక ఈ సంబరాల్లో దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. పునీత్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ సినిమా విడుదల సందర్భంగా  మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో ఓ అభిమానికి గుండె పోటు వచ్చింది. హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు  22  ఏళ్ళ ఆకాశ్‌ జేమ్స్ రిలీజ్ ఉత్సవాల్లో  పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్‌ కు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించే లోపే మరణించాడు. ఈ సంఘటన పునిత్ రాజ్ కుమార్ అభిమాన సంఘాలలో విషాదాన్ని నింపింది.
 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి