వివాదానికి కారణం మోహన్ బాబు బంధువేనా .. మనోజ్, విష్ణు మధ్య ఏం జరిగింది ?

By Asianet NewsFirst Published Mar 24, 2023, 5:23 PM IST
Highlights

మంచు విష్ణు గొడవ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంచు మనోజ్ కి సన్నిహితుడైన సారథి అనే వ్యక్తితో మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియో షేర్ చేశారు.

శుక్రవారం ఉదయం నుంచి మంచి ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత వివాదాలు తెరపైకి వచ్చాయి. మంచు విష్ణు గొడవ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఇంటి వివాదం రచ్చకెక్కింది. కుటుంబ పరువు సమస్య కావడంతో వెంటనే మోహన్ బాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 

తాజాగా జరిగిన గొడవతో మంచు మనోజ్, విష్ణు మధ్య పొసగడం లేదనేది స్పష్టం అవుతోంది. మంచు మనోజ్ కి సన్నిహితుడైన సారథి అనే వ్యక్తితో మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియో షేర్ చేశారు. వాడేదో అన్నాడు కదా ఒరేయ్ గిరేయ్ అని అంటూ మంచు విష్ణు.. సారథితో గొడవపడుతూ కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో.. ఇదీ పరిస్థితి.. ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారు అండీ మా వాళ్ళని బంధువులని అంటూ మంచు మనోజ్ వాయిస్ వినిపిస్తోంది. 

దీనితో అసలు సారథి ఎవరు ? అతడి వల్లేనా మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్థలు ఏర్పడింది ? అనే కోణంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సారథి గురించి అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సారథి మోహన్ బాబుకి సమీప బంధువేనట. ఆ చనువుతోనే ముందుగా మంచు విష్ణుకి దగ్గరయ్యాడు. మంచు విష్ణుకి అనుచరుడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 

మా అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు పక్కనే ఉంటూ చాలా క్రియాశీలకంగా వ్యవహారించాడట. కానీ కొన్ని రోజులకు మంచు మనోజ్ కి దగ్గరై అతడి మేనేజర్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు చెలరేగేలా సారథి వ్యవహరించాడని ప్రచారం జరుగుతోంది. కుటుంబ విషయాలలో ఇతరులకి అతిగా చనువు ఇవ్వడం కూడా తగదు అనే ఈ సంఘటనపై నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

సారథిపై ఆగ్రహంతోనే మంచు విష్ణు అతడిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఆ వీడియోనే మనోజ్ సోషల్ మీడియాలో పెట్టాడు. మోహన్ బాబు ఇన్వాల్వ్ అయి ఆ వీడియో డిలీట్ చేయించే లోపే అది వైరల్ అయింది. మంచు ఇంటిగుట్టు రచ్చకెక్కింది. మంచు మనోజ్ రెండో వివాహం జరిగినప్పటి నుంచి ఆ ఫ్యామిలిలో ఏదో జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి మోహన్ బాబు, మంచు లక్ష్మి ఎంటర్ అయి అన్నదమ్ముల మధ్య ఈమేరకు రాజీ కుదుర్చుతారో చూడాలి. 

click me!