తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ సింగర్.. లండన్ లోని ఆస్పత్రిలో చికిత్స.. డిటేయిల్స్

By Asianet NewsFirst Published Mar 24, 2023, 6:22 PM IST
Highlights

పద్మశ్రీ అవార్డు గ్రహీత... ప్రముఖ సింగర్ బాంబే జయశ్రీ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉన్నారు. ఆమెను కుటుంబ సభ్యులు అక్కడి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 

ప్రముఖ గాయనీ బాంబే జయశ్రీ (Bombay Jayashri)  తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కచేరీ పర్యటనల కోసం యూకేకు వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. లివర్ పూల్ లోని ఒక హోటల్ లో జయశ్రీ కచేరీలు చేస్తున్న సమయంలోనే కళ్లు తిరిగి పడిపోయారని అంటున్నారు.  అయితే ఆమెకు తీవ్రమైన మెడనొప్పి కారణంగా కిందపడిపోయారని సన్నిహితులు వెల్లడించినట్టు తెలుస్తోంది. 

అయితే జయశ్రీకి అనూరిజం అనే వ్యాధి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీని కారణంగా లండన్‌లో ఆసుపత్రిలో చేరారంటున్నారు. అనూరిజం వల్ల మెదడులోని రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి ఆమె శస్త్రచికిత్స కూడా చేయించుకుందని తెలుస్తోంది. మరోవైపు హార్ట్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన జయశ్రీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా నిలకడానే ఉందని ఉందని, మందులకు స్పందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారన్నారు.  ఇక బాంబే జయశ్రీ కర్ణాటక గాయనీగా చాలా ఫేమ్ దక్కించుకున్నారు. పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. 2021లోనూ  జయశ్రీకి పద్మశ్రీ అవార్డు దక్కింది. కర్ణాటిక్, ఇండియన్ క్లాసిక్, ఫిల్మ్ కు పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడారు. 2023లోనే ఆమెకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళానిధి అవార్డుతో సత్కరించారు. 

click me!