సీఎంగా రామ్‌చరణ్‌.. చిరు కోరికని ఇలా తీరుస్తాడేమో?

Published : Mar 29, 2021, 07:39 AM IST
సీఎంగా రామ్‌చరణ్‌.. చిరు కోరికని ఇలా తీరుస్తాడేమో?

సారాంశం

రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన బర్త్ డే సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ ట్రెండ్‌ అయ్యింది. మరోవైపు చరణ్‌ తన నెక్ట్స్ సినిమాని ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌లో ఒకరైన శంకర్‌ డైరెక్షన్‌లో చేయబోతున్నారు. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సీఎంగా మారబోతున్నాడు. త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట. ఊహించని విధంగా చరణ్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ కథేంటో చూస్తే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన బర్త్ డే సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ ట్రెండ్‌ అయ్యింది. మరోవైపు చరణ్‌ తన నెక్ట్స్ సినిమాని ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌లో ఒకరైన శంకర్‌ డైరెక్షన్‌లో చేయబోతున్నారు. దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ త్వరలోనే రానుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా పొలిటికల్‌ సెటైర్‌ కథాంశంతో తెరకెక్కనుందట. ప్రస్తుతం రాజకీయాలు, ప్రజలు తీరు, ఇతర సామాజిక అంశాల మేళవింపుగా ఉంటుందని, ఇందులో చరణ్‌ డైనమిక్‌ సీఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. `ఒకే ఒక్కడు` తరహాలో ఈ కథ సాగుతుందనే ప్రచారం నడుస్తుంది. శంకర్‌ మార్క్ టేకింగ్‌ దీనికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలువనుందట. ఇదిలా ఉంటే చిరంజీవి తానుసీఎం కావాలని రాజకీయాల్లోకి వచ్చి `ప్రజారాజ్యం` పార్టీ పెట్టారు. కానీ విఫలమయ్యారు. పవన్‌ సైతం సీఎం కోరికతోనే ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరి ఆ కోరికని చరణ్‌ సినిమాలో ఈ రూపంలో తీరుస్తాడా? అనే సెటైర్లు కూడా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్