దేశంలోనే రెండవది... ప్రభాస్ లేటెస్ట్ కార్ వివరాలు తెలిస్తే షాకే

By team teluguFirst Published Mar 28, 2021, 8:46 PM IST
Highlights

ప్రభాస్ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ కార్ బ్రాండ్స్ లో ఒకటైన లాంబోర్గిని కారు కొన్నారు. లాంబోర్గిని అవెండర్ ఎస్ రోడ్స్టర్ మోడల్ కి చెందిన ఖరీదైన కారును ప్రభాస్ కొనుగోలు చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే దేశంలోనే ఇది కేవలం రెండో కారు మాత్రమే అట. అంటే ప్రభాస్ తో పాటు మరొకరికి మాత్రమే ఈ మోడల్ కారు ఉన్నట్లు ప్రముఖ సంస్థ తెలియజేయడం జరిగింది.


బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయనతో సినిమా చేయాలంటే కనీసం రూ. 400 కోట్లు కావలి. ఇక ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా రూ. 100 కోట్ల పైమాటే అన్న మాట వినిపిస్తుంది. మరి ఆస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకొనే ప్రభాస్ లైఫ్ అండ్ లగ్జరీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్ ఓ ఖరీదైన ఇల్లు కొన్నారని ప్రచారం జరుగుతుంది. 


తాజాగా ప్రభాస్ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ కార్ బ్రాండ్స్ లో ఒకటైన లాంబోర్గిని కారు కొన్నారు. లాంబోర్గిని అవెండర్ ఎస్ రోడ్స్టర్ మోడల్ కి చెందిన ఖరీదైన కారును ప్రభాస్ కొనుగోలు చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే దేశంలోనే ఇది కేవలం రెండో కారు మాత్రమే అట. అంటే ప్రభాస్ తో పాటు మరొకరికి మాత్రమే ఈ మోడల్ కారు ఉన్నట్లు ప్రముఖ సంస్థ తెలియజేయడం జరిగింది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే.. రూ 5 నుండి 6 కోట్ల వరకు ఉంటుందట. తన రేంజ్ కి తగ్గట్టు సూపర్ బ్రాండ్ కార్ సొంతం చేసుకున్న ప్రభాస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 

మరోవైపు ప్రభాస్ వరుసగా మూడు చిత్రాలు సెట్స్ పైకి తీసుకెళ్లారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇక సలార్ షూటింగ్ మరియు ఆదిపురుష్ చిత్రాల కూడా సెట్స్ పై ఉన్నాయి. వీటి తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ చిత్ర షూటింగ్ మొదలుపెడతారు. 
 

click me!