నాని సినిమా అందుకే వదులుకున్నా అంటున్న విశ్వక్!

By team teluguFirst Published Mar 28, 2021, 9:04 PM IST
Highlights

విశ్వక్ గత చిత్రం హిట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ మూవీలో విశ్వక్ యాంగ్రీ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ గా కనిపించారు. హిట్ మూవీ పాజిటివ్ టాక్ తో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రానికి ఇటీవల సీక్వెల్ ప్రకటించారు. 
హిట్ 2 మూవీలో అడివి శేషు హీరోగా నటిస్తున్నట్లు నిర్మాత నాని ప్రకటించారు. 


కెరీర్ బిగినింగ్ నుండి భిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆయన లేటెస్ట్ మూవీ పాగల్. రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే విశ్వక్ మార్చ్ 29న తన బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 


పాగల్ చిత్ర విశేషాలతో పాటు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆయన అనేక విషయాలు తెలియజేశారు. ఇక విశ్వక్ గత చిత్రం హిట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ మూవీలో విశ్వక్ యాంగ్రీ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ గా కనిపించారు. హిట్ మూవీ పాజిటివ్ టాక్ తో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రానికి ఇటీవల సీక్వెల్ ప్రకటించారు. హిట్ 2 మూవీలో అడివి శేషు హీరోగా నటిస్తున్నట్లు నిర్మాత నాని ప్రకటించారు. 


ఈ నేపథ్యంలో హిట్ సీక్వెల్ లో మీరు ఎందుకు నటిచడం లేదని విశ్వక్ ని మీడియా అడగడం జరిగింది. దీనికి సమాధానంగా విశ్వక్, డేట్స్ ఖాళీగా లేకపోవడం వలనే హిట్ 2 వదులుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. పాగల్ తరువాత మరో మూడు చిత్రాలు చేయాల్సి ఉంది. కాబట్టి డేట్స్ కుదరక హిట్ 2 చేజారిందని విశ్వక్ తెలియజేశాడు. 

click me!