యుఎస్ లో పెళ్లి వేడుకలో చరణ్, వెంకటేష్ సర్ప్రైజ్.. మెగా పవర్ స్టార్ ని ఆటపట్టించిన సీనియర్ హీరో

Published : Feb 27, 2023, 05:22 PM IST
యుఎస్ లో పెళ్లి వేడుకలో చరణ్, వెంకటేష్ సర్ప్రైజ్.. మెగా పవర్ స్టార్ ని ఆటపట్టించిన సీనియర్ హీరో

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనేందుకు చరణ్ ఇటీవల యుఎస్ వెళ్లారు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనేందుకు చరణ్ ఇటీవల యుఎస్ వెళ్లారు. అలాగే హెచ్ సి ఏ అవార్డ్స్ వేడుకలో కూడా పాల్గొన్నారు. రాంచరణ్ కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. 

అభిమానులు, సెలెబ్రిటీలు రాంచరణ్ ని గ్లోబల్ స్టార్ అని కీర్తిస్తున్నారు. దీనితో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. హెచ్ సి ఏ అవార్డ్స్ లో చరణ్ స్పాట్ లైట్ అవార్డుని దక్కించుకున్నాడు. చరణ్ మార్చిలో జరిగే ఆస్కార్ అవార్డ్స్ వేడుక వరకు యుఎస్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా రాంచరణ్ అమెరికాలో తన వెల్ విషర్ ఫ్యామిలిలో జరుగుతున్న వివాహ వేడుకకి హాజరయ్యాడు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఈ మ్యారేజ్ వేడుకకి విక్టరీ వెంకటేష్ కూడా హాజరు కావడం విశేషం. 

పెళ్లి వేడుకలో రాంచరణ్, వెంకటేష్ భలే సందడి చేశారు. రాంచరణ్ కి శుభాకాంక్షలు చెబుతూనే వెంకటేష్ కాస్త ఆటపట్టించారు. అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడుతూ ' ఇట్స్ నాటు నాటు హే మిస్టర్ చరణ్.. ఆల్ ది అవార్డ్స్ గోస్ టు చరణ్ ఒకే' అని అన్నారు. దీనికి చరణ్ సమాధానం ఇస్తూ.. థాంక్యూ సో మచ్ వెంకీ అన్నా అని బదులిచ్చాడు. 

వీరిద్దరి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాహం ఎవరిది అనే పూర్తి వివరాలు మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉండగా మార్చి 12న ఆస్కార్స్ అవార్డుల వేడుక జరగనుంది. నాటు నాటు సాంగ్ కి ఆరోజున ఆస్కార్ అవార్డు దక్కాలి అని యావత్ దేశం మొత్తం అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆస్కార్స్ తుది నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ఒరిజినల్ సాంగ్ ఇదే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌