బూతుల ఎఫెక్ట్ .. రానా నాయుడు వెబ్ సిరీస్ పై.. నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం

Published : Mar 30, 2023, 06:55 AM ISTUpdated : Mar 30, 2023, 07:16 AM IST
బూతుల ఎఫెక్ట్ .. రానా నాయుడు వెబ్ సిరీస్  పై.. నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం

సారాంశం

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రానా నాయుడు వెబ్ సిరీస్ పై వస్తున్న విమర్షలకు దిద్దుబాటు చర్యలు తీసుకుంది.  సడెన్ గా తమ నిర్ణయంతో అందరికీ.. షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే..? 

విక్టరీ వెంకటేష్, రానా లు ప్రధాన పాత్రలో నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు. భారీ హైప్ తో..ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్  అయిన ఈ మూవీ.. అందరికి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు జనాలకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ సిరీస్ లో పరిమితికి మించి బూతులు ఉండటం.. సెక్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో.. వెంకటేష్, రానాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.  అంతే కాదు ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి బూతు సిరీస్ గా గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాదు ఈ ఎఫెక్ట్  అంతకంతకూ పెరుగుతూ.. ఓటీటీ కంటెంట్ పై  కోర్టుల్లో కేసులు వేయడటంతో.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది నెట్ ప్లిక్స్. 

 రానా నాయుడు సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో చాలా భాషల్లో అందుబాటులో ఉంది. అందులో  తెలుగు ఆడియో కూడా ఉండటంతో. తాజాగా  తాజాగా తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలా తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం బూతులు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 ఇక బూతుల ఎఫెక్ట్ పడటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ సిరీలో సెన్సార్ కు మించి బూతులు, సెక్స్ సీన్స్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్సి వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది.ఈక్రమంలో రానా నాయుడు.. ఫ్యూస్ పరంగా  సంచలనం సృష్టించింది. అద్భుతంగా రెస్పాన్స్ కూడా సంపాదించిది. రానా నాయుడు వెబ్ సిరీస్ తో వెంకటేష్ తో సహా రానా తొలిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అరంగేట్రం చేశారు. ఇక ఈ సిరీస్ ఉన్న అడల్ట్ కంటెంట్ కారణంగా విపరీతమైన క్రేజ్ తో పాటు.. విమర్శలను కూడా ముట కట్టుకుంది. ఈ సిరీస్ లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా 12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా  8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌