సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Published : Mar 30, 2023, 06:09 AM ISTUpdated : Mar 30, 2023, 07:14 AM IST
సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు సైలెంట్ గా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. కామ్ గా ఉంటూనే కత్తిలా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సౌత్ హీరోలలో ఎవరు సాధించలేని ఘనత సాధించారు సూపర్ స్టార్. 

ఏడాదికి ఒక్క సినిమా.. అది హిట్ అయినా. ప్లాన్ అయినా..సరే ఏడాదికి ఒకటే సినిమా..  చేస్తాడు.. మహేష్ బాబు.  అయినాసరేఎప్పటికప్పుడు ఇమేజ్ పెరుగుతూ వస్తోంది సూపర్ స్టార్ మహేష్ ది. 50 ఏళ్లకు మూడడుగుల దూరంలో ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్.. అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో రికార్డ్స్ తిరగరాస్తున్నాడు. అంతే కాదు సైలెంట్ గా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు సూపర్ స్టార్.

ఎవరైనా చేసిన పనిని గోప్పగా చెప్పుకుంటారు. అందులో ఎన్ని లోటు పాట్లు ఉన్నా చెప్పడం మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. కాని ఇప్పటి వరకూ దాదాపు వెయ్యికి పైగా హార్ట్ ఆపరేషన్లు పిల్లలకు తన సొంత ఖర్చుతోచేయించాడు మహేష్. ఏహీరో ఇంత గోప్ప పని చేయలేదు. ఎంతో మంది ఇళ్లల్లో దీపాలు వెలిగించిన మహేష్ బాబు.. రీల్ హీరోగానే కాకుండా.. రియల్ హీరో అనిపించుకున్నాడు. అంతే కాదు ఆ పిల్లల కుటుంబాల పాలిట దేవుడిగా మారాడు. 

రకరకాల మార్గాల్లో స్టార్ హీరోలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. మరికొంత మంది వారి విలాసాలకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు.  కాని ఇలా ఎంత మంది మంచి పనులకు ఖర్చు చేస్తారు. ఆ ఘనత సాధించింది ఒక్క మహేష్ బాబు మాత్రమే. ఇక ఆ విషయం పక్కన పెడితే మహేష్ రీసెంట్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌత్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో  ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సోషల్ మీడియాలో కూడా మహేశ్ బాబు  అదే రికార్డ్ తో దూసుకువెళ్తున్నాడు.  దక్షిణాదిన అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా రికార్డు సృష్టించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేశ్ బాబును ఫాలో వుతున్నారు. . ప్రతి సోషల్ మీడియా వేదికపైనా మహేశ్ కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం మరో విశేషం. అంతే కాదు సౌత్ లో ఏహీరోకు ఇలాంటి గైరవం దక్కలేుదు. దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు  దిల్ ఖుష్ అవుతున్నారు. సంతోషంతో..  ఉప్పొంగిపోతున్నారు. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను.. వచ్చే ఏడాది 2024  సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈసినిమా తరువాత ఆయన టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌