తమన్నాతో రాంచరణ్ కామెడీ.. సైరాలో వాళ్ళిద్దరి సీన్స్ ఎలా ఉంటాయంటే!

Published : Sep 28, 2019, 04:55 PM IST
తమన్నాతో రాంచరణ్ కామెడీ.. సైరాలో వాళ్ళిద్దరి సీన్స్ ఎలా ఉంటాయంటే!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజవుతోంది. హిందీలో కూడా పెద్దఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీనితో సైరా చిత్రయూనిట్ అన్ని ప్రధాన నగరాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

చిరంజీవి, రాంచరణ్ తో పాటు ఇతర సైరా చిత్ర యూనిట్ చెన్నైలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రాంచరణ్, తమన్నా మధ్య సరదా సంభాషణ సాగింది. రాంచరణ్ మాట్లాడుతూ నా ఫేవరేట్ నటి తమన్నా ఈ చిత్రంలో నటించింది అని చరణ్ తెలిపాడు. దీనికి తమన్నా స్పందిస్తూ కేవలం ఫేవరెట్ మాత్రమేనా నేను మోస్ట్ ఫేవరెట్ అని తమన్నా తెలిపింది. అవును నిజమే అంటూ చరణ్ సరదాగా ఒప్పుకున్నాడు. 

ఇక తమన్నా మాట్లాడుతూ.. ఇలాంటి భారీ చిత్రంతో నయనతారతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఇద్దరి పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని తమన్నా తెలిపింది. 

చిరంజీవి తన ప్రసంగంలో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ చిత్రంలో అతడి పాత్ర మరిచిపోలేనిది. విజయ్ సేతుపతి ఎంత బిజీ నటుడో నాకు తెలుసు. అయినా కూడా సైరా నటించేందుకు అంగీకరించాడు. విజయ్ సేతుపతి సింప్లిసిటీకి తాను ఆశ్చర్యపోయినట్లు చిరంజీవి ప్రశంసించారు. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ