గోపిచంద్- మారుతి సినిమా టైటిల్‌ ప్రకటించేసారు

By Surya PrakashFirst Published Feb 14, 2021, 10:39 AM IST
Highlights


  గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ కూడా వెలువడింది. కానీ ఈ సినిమా టైటిల్ గానీ మరే ఇతర వివరాలు గానీ వెల్లడించలేదు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొద్ది సేపటి క్రితం ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'సీటీమార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను ఈ రోజు ఇచ్చారు. 

ఈ సినిమాకి పక్కా కమర్షియల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ అయిదో తారీకు మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక ఈ సినిమాను అక్టోబరు ఒకటో తారీకున విడుదల చేస్తున్నామని కూడా యూనిట్ ప్రకటించింది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని బన్ని వాసు, వంశీలు గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అలానే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపిక అయింది అని అంటున్నారు దాని మీద మాత్రం అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.

Bless us my next with Macho star garu It is..👌 pic.twitter.com/SsAM9brNJ3

— Director Maruthi (@DirectorMaruthi)

"ఈ రోజుల్లో", "బస్ స్టాప్"వంటి చిత్రాలను తీసిన డైరెక్టర్ మారుతి.. ఆ సినిమాలు విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలైన ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సినిమాల గురించి డైరెక్టర్ మారుతి  చేస్తున్న సినిమా ఇదే. 

డైరెక్టర్ మారుతి పదవ సినిమాగా గోపీచంద్ 29వ సినిమాగా తెరకెక్కించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, యు.వి. క్రియేషన్స్ కలసి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో వచ్చిన "బలే బలే మగాడివోయ్","ప్రతి రోజు పండగే" వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.

click me!