శంకర్‌ని కలిసి రామ్‌చరణ్‌.. సీఎం పదవి ఖాయమైనట్టేనా?

Published : Jul 05, 2021, 01:58 PM IST
శంకర్‌ని కలిసి రామ్‌చరణ్‌.. సీఎం పదవి ఖాయమైనట్టేనా?

సారాంశం

 చెర్రీ, దిల్‌రాజులకు దర్శకుడు శంకర్‌ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఆదివారం చాలా బాగా గడిచిందని తెలిపారు.

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ని కలిశాడు రామ్‌చరణ్‌. నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆదివారం చెన్నైలో కలుసుకున్నారు. చెర్రీ, దిల్‌రాజులకు దర్శకుడు శంకర్‌ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఆదివారం చాలా బాగా గడిచిందని తెలిపారు. ట్వీట్‌లో ఆయన చెబుతూ, `నిన్న అద్భుతమైన రోజు. గ్రేట్‌ హోస్ట్ చేసినందుకు శంకర్‌ సర్, వారి ఫ్యామిలీకి ధన్యవాదాలు. #rc15 కోసం ఎదురుచూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ త్వరలో రానుంది` అని ట్వీట్‌ చేశారు రామ్‌చరణ్‌. 

రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందే పాన్‌ ఇండియా చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో అది 50వ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాని గత కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ అప్పటికే శంకర్‌.. కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2` చేయాల్సి ఉంది. అది అనేక అవాంతరాల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమాని పక్కన పెట్టి దర్శకుడు శంకర్‌ తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ సినిమా, హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో `అపరిచితుడు` రీమేక్‌ని ప్రకటించారు. 

దీన్నిసవాల్‌ చేస్తూ `ఇండియన్‌ 2` నిర్మాణ సంస్థ లైకా కోర్ట్ కెళ్లింది. తమ సినిమాని పూర్తి చేసిన తర్వాత మిగిలిన ప్రాజెక్ట్ లోకి వెళ్లేలా ఆదేశించాలని లైకా కోర్ట్ ని కోరింది. అనేక వాదోపవాదనల అనంతరం ఈ కేసుని కోర్ట్ కొట్టేసింది. దర్శకుడు తనకిష్టం వచ్చిన సినిమా తీసుకొచ్చవని తెలిపింది. దీంతో సస్పెన్స్ నెలకొన్న రామ్‌చరణ్‌ సినిమాకి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌, దిల్‌రాజు ఆదివారం శంకర్‌ని కలవడం సినిమా పనులు ఊపందుకున్నాయనే సందేశాన్ని అందిస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో చెర్రీ సీఎంగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా పట్టాలెక్కేందుకు అడ్డంకులు క్లీయర్‌ కావడంతో చెర్రీ ఇక సీఎం కావడం ఖాయమంటూ నెటిజన్లు ఫన్సీ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇందులో ఓ బలమైన పోలీస్‌ పాత్ర ఉందట. అందుకోసం ఓ బాలీవుడ్‌ హీరోని తీసుకోవాలనుకుంటున్నారట. సల్మాన్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kiccha Sudeep Daughter: సింగర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరో కూతురు.. త్వరలోనే నటిగా ఎంట్రీ ?
Vrusshabha Review: వృషభ మూవీ రివ్యూ, మోహన్‌ లాల్‌ సినిమా ఎలా ఉందంటే ?