అమీర్ విడాకులపై మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ సంచలన పోస్ట్

Published : Jul 05, 2021, 01:16 PM IST
అమీర్ విడాకులపై మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ సంచలన పోస్ట్

సారాంశం

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె పరోక్షంగా తండ్రి అమీర్ విడాకులపై స్పందించినట్లు తెలుస్తుంది. ఐరా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో చేసిన ఓ కామెంట్ వైరల్ కావడం జరిగింది. 


అమీర్ ఖాన్-కిరణ్ రావ్ విడాకులు తీసుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం ఉమ్మడి ప్రకటన చేశారు. 15ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేని సునామి మాదిరి అమీర్ నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. అమీర్ ఖాన్ ఫ్యాన్స్, సన్నిహితులు విడాకులకు గల కారణాలు తెలుకోవాలని అనుకుంటున్నారు. 


కాగా నిన్న అమీర్ భార్య కిరణ్ రావ్ తో కలిసి వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియోలో అమీర్, విడిపోవాలన్న నిర్ణయం మా ఇద్దరినీ సంతోష పెట్టిందని, విడాకులు తీసుకుంటున్నందుకు తమకు ఎలాంటి బాధ లేదని తెలియజేశారు. భార్య భర్తలుగా విడిపోయినా మిత్రులుగా తమ మధ్య బంధం కొనసాగుతుంది అన్నారు. ఆ వీడియోలో అమీర్, కిరణ్ స్మైలీ ఫేసెస్ తో సంతోషంగా కనిపించారు. 


ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె పరోక్షంగా తండ్రి అమీర్ విడాకులపై స్పందించినట్లు తెలుస్తుంది. ఐరా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో చేసిన ఓ కామెంట్ వైరల్ కావడం జరిగింది. రేపు తదుపరి రివ్యూ, ఏమి జరగబోతుందో మరి?... అంటూ కామెంట్ చేశారు. 


అమీర్ విడాకులు ఉద్దేశించి ఐరా సెటైరికల్ కామెంట్ చేశారని కొందరు భావిస్తున్నారు. అమీర్ మొదటి భార్య రీనా దత్త కూతురే ఐరా ఖాన్. తన సవతి తల్లిని కూడా వదిలేసిన అమీర్ ని ఉద్దేసింది ఆమె ఇలాంటి కామెంట్ చేసి ఉండవచ్చు. ఇక ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఐరా డేటింగ్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ఆ కారణంతోనే జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర కనిపించట్లేదు: కమెడియన్ వెంకీ