ఓటు వేయలేకపోతున్నా.. రామ్ చరణ్ ఆవేదన!

Published : Dec 07, 2018, 12:28 PM IST
ఓటు వేయలేకపోతున్నా.. రామ్ చరణ్ ఆవేదన!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్నే సతమణి తో కలిసి ఓటేశారు. ఆయన కూతురు శ్రీజ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఎలక్షన్స్ లో హాజరుకాలేదు.

టాలీవుడ్ లో సినీ తారలు వేగంగా వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంచి సెలబ్రెటీలు ఓటు వేశారు. మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్నే సతమణి తో కలిసి ఓటేశారు. ఆయన కూతురు శ్రీజ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఎలక్షన్స్ లో హాజరుకాలేదు. 

అందుకు సోషల్ మీడియా ద్వారా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓటు వేయలేకపోతున్నందుకు బాధపడుతున్నా అని వివరణ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోతున్నానని అందుకు నిరుత్సాహంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని వివరణ ఇచ్చారు. 

చరణ్ ఎందుకు హాజరుకాలేదు అనే విషయంపై క్లారిటీ అయితే ఇవ్వలేదు గాని కొన్ని రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. వాటి సంగతి పక్కనపెడితే రీసెంట్ గా చరణ్ మల్టీస్టారర్ RRR ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశాడు. సినిమాలో మరో హీరోగా నటిస్తోన్నతారక్ చిత్ర దర్శకుడు రాజమౌళి ఉదయం వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే