
తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ బిజినెస్ తోపాటు సోషల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువే చేస్తుంటుంది. పాఠశాలల్లో విద్యా వ్యవస్థ మెరుగు పడేందుకు సాయమందించేలా ఏర్పడ్డ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఆధ్వర్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. ఆంగ్లంలో విద్యార్థులకు తర్ఫీదునిప్పించే ఈ సంస్థ ఏడాది చివరలో టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ తో విద్యార్థులకు ఉత్తీర్ణతనిస్తుంది. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ నినాదంతో రకుల్ విద్యార్థులకు చైతన్య వంతులను చేస్తూ ఆదర్శవంతంగా నిలిచింది.