ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న "దడ పుట్టిస్తా"

Published : Apr 14, 2017, 11:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న "దడ పుట్టిస్తా"

సారాంశం

ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న "దడ పుట్టిస్తా" 

విన్నీ వియాన్ కథానాయకుడిగా పి.జె.ఆర్ & ఏన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం "దడ పుట్టిస్తా". రోమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్.ఇ దర్శకుడు. నాయిని పృధ్వీ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు విన్నీ వియాన్ సరసన నేహా-హరిణీలు కథానాయికలుగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని కె.చిన్ని-కె.శ్రీనివాసరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థామ్సన్ మార్టిన్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇటీవల విడుదలై మంచి ఆదరణ చూరగొంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కె.చిన్ని-కె.శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ.. "రొమాన్స్ తోపాటు హారర్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా కలిగిన చిత్రం "దడ పుట్టిస్తా". విన్నీ వియాన్ కు ఈ సినిమా మంచి లాంచ్ పాడ్ అవుతుంది. దర్శకుడు హరీష్ హిలేరియస్ హారర్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు!  

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన