సైలెంట్ గా కార్తికేయ నిశ్చితార్థం.. ఓ ఇంటివాడు కాబోతున్న ఆర్ఎక్స్ 100 హీరో

Published : Aug 23, 2021, 10:34 AM ISTUpdated : Aug 23, 2021, 10:35 AM IST
సైలెంట్ గా కార్తికేయ నిశ్చితార్థం.. ఓ ఇంటివాడు కాబోతున్న ఆర్ఎక్స్ 100 హీరో

సారాంశం

యువ హీరో కార్తికేయ ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. యువతకు నచ్చే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. పాత్ర నచ్చితే నెగిటివ్ రోల్స్ లో కూడా అదరగొడుతున్నాడు కార్తికేయ.

యువ హీరో కార్తికేయ ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. యువతకు నచ్చే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. పాత్ర నచ్చితే నెగిటివ్ రోల్స్ లో కూడా అదరగొడుతున్నాడు కార్తికేయ. తాజాగా కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. 

సైలెంట్ గా కార్తికేయ నిచ్చితార్ధం జరిగిపోయింది. అంటే త్వరలోనే ఈ యువ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కార్తికేయ నిశ్చితార్థ వేడుక జరిగింది. నిశ్చితార్థానికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది పెద్దలు కుదిర్చిన వివాహంగా తెలుస్తోంది. వివాహ తేదీ, కార్తికేయకు కాబోయే భార్య గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కార్తికేయ ఆర్ఎక్స్ 100 చిత్రంలో ఎమోషనల్ నటనతో ప్రేక్షకులని ఫిదా చేశాడు. 

ప్రస్తుతం కార్తికేయ రాజా విక్రమార్క అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే అజిత్ వాలిమై మూవీలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ మూవీలో కార్తికేయ నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయపై అంతటి సాలిడ్ హిట్ లేదు. కానీ తన నటనతో మెప్పిస్తున్నాడు. త్వరలోనే తన నిశ్చితార్థం గురించి కార్తికేయ అధికారికంగా అభిమానులకు తెలిపే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్