పాగల్‌ హీరోతో రకుల్‌.. ఓటీటీ కోసం యంగ్‌ హీరోతో రొమాన్స్ ?

Published : Jun 29, 2021, 12:47 PM ISTUpdated : Jun 29, 2021, 12:56 PM IST
పాగల్‌ హీరోతో రకుల్‌.. ఓటీటీ కోసం యంగ్‌ హీరోతో రొమాన్స్  ?

సారాంశం

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ యంగ్‌ హీరోతో రొమాన్స్ కి సిద్ధమవుతుంది. `పాగల్‌` హీరో విశ్వక్‌ సేన్‌తో జోడి కడుతుంది. అయితే ఓటీటీ సినిమా కోసం రకుల్‌.. విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించడం విశేషం. 

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ యంగ్‌ హీరోతో రొమాన్స్ కి సిద్ధమవుతుంది. `పాగల్‌` హీరో విశ్వక్‌ సేన్‌తో జోడి కడుతుంది. అయితే ఓటీటీ సినిమా కోసం రకుల్‌.. విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించడం విశేషం. ఇప్పటికే సమంత, కాజల్‌, తమన్నా, రాశీఖన్నా వంటి హీరోయిన్లు ఓటీటీలో నటిస్తున్నారు. ఇప్పుడు రకుల్‌ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతుంది. 

విశ్వక్‌ సేన్‌ నటించిన `పాగల్‌` విడుదలకు సిద్ధంగా ఉంది. అనంతరం మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇటీవల అది పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ ఓటీటీలో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. పాంథాలజీ నేపథ్యంలో హలోవీన్‌ డే నైట్‌ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ గా సాగే ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు తమిళంలో బైలింగ్వల్‌గా రూపొందిస్తున్నారు. 

దీనికి `అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌` అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ఇందులో నివేతా పేతురాజ్‌, మంజిమా మోహన్‌, మేఘా ఆకాష్‌, రేబా మోనికా జాన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇందులో విశ్వక్‌సేన్‌ ది గెస్ట్ రోల్‌ అని టాక్. కానీ అతని పాత్ర హైలైట్‌గా, ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందట. ఇందులో విశ్వక్‌ సరసన రకుల్‌ని సంప్రదించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. రకుల్‌ పాత్రకి కూడా ప్రయారిటీ ఉంటుందట. 

రకుల్‌ చివరగా `చెక్‌` చిత్రంలో నటించింది. ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ సరసన `జంగిల్‌బుక్‌` సినిమాలో నటిస్తుంది. హిందీలో `మేడే`, `ఎటాక్‌`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమా చేయబోతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద