భూవివాదంలో.. నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదు..

Published : Jun 29, 2021, 11:59 AM ISTUpdated : Jun 29, 2021, 12:57 PM IST
భూవివాదంలో.. నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదు..

సారాంశం

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదైంది. భూవివాదం విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదైంది. భూవివాదం విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సి. కళ్యాణ్‌తోపాటు మరో ముగ్గురు షారూఫ్‌‌, శ్రీకాంత్‌, తేజస్వీలపై కేసు ఫైల్‌చేశారు. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌, 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. 

అయితే సోమవారం సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు గోపీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితోపాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలోనూ నిర్మాత సి. కళ్యాణ్‌పై ఈ భూ వివాదం విషయంలో ఆరోపణలు వచ్చాయి. కొందరు పోలీస్‌ స్టేషన్‌కి కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. సి. కళ్యాణ్‌ టాలీవుడ్‌లో బడా నిర్మాతల్లో ఒకరు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

షాపింగ్ మాల్‌లో ప్రేమ‌, ల‌క్ష‌ల్లో ఒక‌రికి వ‌చ్చే అరుదైన వ్యాధి.. పెద్ది రెడ్డి సింగ‌ర్ జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు
100 కోట్లు దాటి పరుగులు పెడుతున్న రాజా సాబ్ , 4వ రోజు ప్రభాస్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?