నాని సినిమాలో రకుల్ ఐటెం సాంగ్!

Published : Feb 20, 2019, 04:57 PM IST
నాని సినిమాలో రకుల్ ఐటెం సాంగ్!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. కానీ తమిళ, హిందీ భాషల్లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వస్తున్నాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. కానీ తమిళ, హిందీ భాషల్లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా త్వరలోనే రకుల్ ఐటెం సాంగ్ లో కనిపించనుందని సమాచారం. నాని హీరోగా దర్శకుడు విక్రం కుమార్ ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ అనే మలయాళీ హీరోయిన్ ని తీసుకున్నట్లు సమాచారం. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. దానికోసం దర్శకనిర్మాతలు స్టార్ హీరోయిన్ రకుల్ ని సంప్రదించినట్లు సమాచారం. 

అయితే దీనికి ఆమె అంగీకరించిందా..? లేదా...? అనే విషయంలో ఇంకా స్పష్టం రాలేదు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు