'మా' అసోసియేషన్ డబ్బు.. హీరో కూతురు ఖాతాలోకి..?

Published : Apr 16, 2019, 11:46 AM IST
'మా' అసోసియేషన్ డబ్బు.. హీరో కూతురు ఖాతాలోకి..?

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎంత హడావిడి జరిగిందో తెలిసిందే. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎంత హడావిడి జరిగిందో తెలిసిందే. శివాజీరాజా, నరేష్ ప్యానెల్ లు ఒకరినొకరు దూషించుకున్నారు. ఇప్పుడు నరేష్ ప్యానెల్ వచ్చింది. దీంతో వీరు చేసే తప్పులను పాత సంఘం ఎత్తిచూపుతోంది.

తాజాగా 'మా' సభ్యుల కోసం ఖర్చు చేయాల్సిన ఏడున్నర లక్షల మొత్తాన్ని జీవిత రాజశేఖర్ కుమార్తె ఖాతాలోకి వెళ్లిపోయాయని వార్తలు గుప్పుమన్నాయి. అలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. కొన్ని విషయాలు బయటకొచ్చాయి. మా సంఘ భవనం కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని స్థలం అడగాలని అనుకున్నారు.

దానికి ముందుగా ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలనే ఐడియాతో తెలంగాణా ప్రభుత్వ పథకాలను పొగుడుతూ కొన్ని ప్రకటనలు  చేయించి కానుకగా ఇద్దామని అనుకున్నారు. దానికోసం ఏడున్నర లక్షలు ఖర్చు చేసేశారు. ఈ మొత్తాన్ని మొదట జీవిత రాజశేఖర్ కుమార్తె భరించి.. ప్రకటనలు చేయించినట్లు చెబుతున్నారు.

ఆ కారణంగానే మా నిధుల నుండి ఆమె అకౌంట్ కి డబ్బు పంపారట. సభ్యుల సంక్షేమం కోసం వాడాల్సిన డబ్బుని ఇలా వేరే పనులకు వాడడంపై వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ  కారణంగా మరోసారి మా అసోసియేషన్ లో రచ్చ జరిగేలా ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌