30 గంటలు కంటిన్యూస్ గా చేయగలను.. రకుల్ కామెంట్స్!

Published : May 10, 2019, 03:09 PM IST
30 గంటలు కంటిన్యూస్ గా చేయగలను.. రకుల్ కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో 'మన్మథుడు2', తమిళంలో సూర్య 'ఎన్ జి కె' చిత్రాల్లో నటిస్తోంది. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో 'మన్మథుడు2', తమిళంలో సూర్య 'ఎన్ జి కె' చిత్రాల్లో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో ఆమె నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా మే 17న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల గురించి మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని చాలా మంది కలలు కంటారు. కానీ చాలా తక్కువ మందికి ఆ ఛాన్స్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో నాకు దక్కిన స్థానం చూసుకొని గొప్పగా ఫీల్ అవుతాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు.. సక్సెస్ అందుకోవడానికి మనం చేసే జర్నీలో ఎదురయ్యే ప్రతికూలతను ఎదిరించడం నేర్చుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చింది.

కష్టపడి పని చేయడమంటే తనకు ఇష్టమని, వర్క్ ని ఎంతగా ప్రేమిస్తా అంటే ముప్పై గంటలు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయగలనని చెప్పింది. సీనియర్ నటులతో పని చేయడం కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని.. వారిని చూసి స్ఫూర్తి పొందుతుంటానని అంది.

'దే దే ప్యార్ దే' సినిమాలో అజయ్ దేవగన్, టబులతో కలిసి నటించడం గొప్ప అనుభవమని, ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది.  

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?