ప్రేమించిన ఆరు నెలలకే సుమతో బ్రేకప్: రాజీవ్ కనకాల

Published : May 10, 2019, 02:50 PM IST
ప్రేమించిన ఆరు నెలలకే సుమతో బ్రేకప్: రాజీవ్ కనకాల

సారాంశం

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. 

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. అయితే ప్రేమించిన ఆరు నెలలకే సుమ బ్రేకప్ చెప్పిందని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజీవ్. తాజాగా విడుదలైన 'మహర్షి' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజీవ్ కనకాల నటించాడు. 

ఆ పాత్రకు మంచి పేరు రావడంతో యూట్యూబ్ ఛానెల్స్ ఆయనతో ఇంటర్వ్యూలుచేస్తున్నాయి. ఈ క్రమంలో తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు రాజీవ్. ఆయన మాట్లాడుతూ.. ''మేఘమాల సీరియల్ లో సుమ హీరోయిన్.. అది మా నాన్నగారే తీశారు. అందులో నాది చాలా చిన్న పాత్ర. 'మేఘమాల' కంటే ముందే సుమని చూశా.. ఒకసారి నేను డైరెక్ట్ చేసిన సీరియల్ కోసం ఎడిట్ సూట్ కి వెళ్లా.. అదే సమయంలో సుమ కూడా అక్కడకి వచ్చింది అక్కడ ఆమెని చూసి ఇంప్రెస్ అయ్యా'' అంటూ చెప్పుకొచ్చారు.

సుమని మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నానని, ఆమెకి ప్రపోజ్ చేసిన తరువాత ఒప్పుకోదని అనుకుంటే మూడు రోజులకు ఫోన్ చేసి ఇష్టమే అని చెప్పిందని  అన్నారు. ఇద్దరం ఓకే అనుకున్న తరువాత మా ప్రేమ ఏడాదిన్నర బ్రేక్ పడిందని చెప్పారు.

పెళ్లికి ముందే ఆంక్షలు పెడుతున్నానని ప్రేమించిన ఆరు నెలలకే బ్రేకప్ చెప్పేసిందని, ఎంత కన్విన్స్ చేసినా.. పట్టించుకోలేదని రాజీవ్ అన్నారు. ఆ తరువాత మళ్లీ 1998లో ప్రేమకథ పట్టాలేక్కిందని, అలా మొదలైన నెల రోజులకే పెళ్లి జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?
Student Politics: రాజకీయ రణరంగంగా మారిన కాలేజీలు.. స్టూడెంట్ పాలిటిక్స్‌పై వచ్చిన 5 బెస్ట్ సినిమాలు