రెమ్యునరేషన్ పెంచేసిన రకుల్

Published : Sep 27, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రెమ్యునరేషన్ పెంచేసిన రకుల్

సారాంశం

స్పైడర్  లో మహేష్ సరసన నటించిన రకుల్ పారితోషికాన్ని పెంచిన రకుల్ 2.5కోట్లు డిమాండ్ చేస్తున్న రకుల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్  లాంటి స్టార్ హీరోలతో పాటు యువ కథనాయకలతో కూడా ఆడిపాడుతున్న రకుల్.. తన రెమ్యునరేషన్ ని పెంచేసింది.  మహేష్ తో ఆమె నటించిన ‘ స్పైడర్’ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నుంచి తన రెమ్యునరేషన్ పెంచేయాలని రకుల్ నిర్ణయించుకుందట.

 

తాను అంగీకరించబోయే.. కొత్త సినిమాలకు రూ.2.5కోట్లు పారితోషికం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆమె డిమాండ్ కి కనుక దర్శక నిర్మాతలు అంగీకరిస్తే.. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల జాబితాల్లోకి రకుల్ చేరిపోయినట్టే. అంతేకాదు.. రూ.2.5కోట్లు అంటే అనుష్క, నయనతార వంటి సీనియర్ తారలకు మించిన పారతోషికం రకుల్ అందుకున్నట్లు అవుతుంది.

 

ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ 2011లో కన్నడ చిత్రం గిల్లీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2014లో టాలీవుడ్‌కు పరిచమైంది. తెలుగులో ఆమె నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం సూపర్ హిట్ కావడంతో రకుల్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

PREV
click me!

Recommended Stories

Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం