'రాక్షసుడు' ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Published : Apr 06, 2019, 11:53 AM IST
'రాక్షసుడు' ఫస్ట్ లుక్ వచ్చేసింది!

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రాక్షసుడు'. 

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రాక్షసుడు'. తమిళంలో ఘన విజయం సాధించిన 'రాచ్చసన్' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఉగాది పండగను పురస్కరించుకొని చిత్రబృందం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బెల్లంకొండ, అనుపమ సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగే ఈ సినిమా ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని చిత్రబృందం ప్రకటించింది. 

ప్రస్తుతం హైదరబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఫిబ్రవరి 13న రిలీజ్ అవ్వబోతున్న నిలవే సినిమా
Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్