'మజిలీ' ఆ ఏరియాల్లో కుమ్మేసింది!

Published : Apr 06, 2019, 11:15 AM IST
'మజిలీ' ఆ ఏరియాల్లో కుమ్మేసింది!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ లో సరైన సినిమాలు లేక మొహం వాచిపోయి ఉన్న ఆడియన్స్ కి ఈ సినిమా మంచి రిలీఫ్ ఇస్తోంది.

ఉగాది కావడం, పైగా వీకెండ్ దీంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజు మార్నింగ్ షో సినిమాకు వచ్చిన టాక్ చూసిన బయ్యర్లు వెంటనే థియేటర్ల సంఖ్య పెంచేశారు.దీంతో మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.

గుంటూరులో ఈ సినిమా తొలిరోజు రూ.66 లక్షలు రాబట్టగా.. ఉత్తరాంధ్రలో రూ.76 లక్షలు వసూలు చేసింది. మిగిలిన ఏరియాల్లో ఎంత వసూలు చేసిందనే విషయం  తెలియాల్సివుంది. ఈ దూకుడు చూస్తుంటే ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాతలు బాగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది