‘దంగల్’ను బీట్ చేస్తూ ‘రాఖీబాయ్’ మరో రికార్డు.. హ్యయేస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిల్మ్ గా ‘కేజీఎఫ్2’..

Published : May 05, 2022, 12:38 PM IST
‘దంగల్’ను బీట్ చేస్తూ ‘రాఖీబాయ్’ మరో రికార్డు.. హ్యయేస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిల్మ్ గా ‘కేజీఎఫ్2’..

సారాంశం

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్ 2’ వరుస రికార్డులను బ్రేక్ చేసుకుంటూ పోతోంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్ర థియేట్రికల్ రన్ ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద రాకీబాయ్ తాజాగా మరో రికార్డును బ్రేక్ చేశాడు. 

KGF ఛాప్టర్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించి, రికార్డులను బద్దలు కొట్టిందీ కేజీఎఫ్. కన్నడ స్టార్ హీరో యష్ (Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్లాక్ బాస్టర్ చిత్రం ముఖ్యంగా హిందీ వెర్షన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Amir Khan) సినిమాను బ్రేక్ చేశాడు రాఖీ బాయ్.

కేజీఎఫ్ చాప్టర్ 2 ముఖ్యంగా హిందీ వెర్షన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం అమీర్ ఖాన్ నటించిన ఇండియన్ హ్యయేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ‘దంగల్’ (Dangal) లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను  దాటేసింది కేజీఎఫ్ ఛాప్టర్ 2. కేవలం 21 రోజుల్లో రూ. 391 కోట్లు వసూలు చేసి ఈ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం హ్యేయేస్ట్ హిందీ గ్రాసింగ్ ఫిల్మ్ గా  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి : ది కన్ క్లూజన్’ లీడ్ లో ఉంది. తాజాగా ఈ చిత్రం తర్వాత స్థానాన్ని కన్నడ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఆక్యుపై చేసింది.

Baahubali 2 హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.510.99 కోట్ల వసూళ్లతో హ్యయేస్ట్ హిందీ చిత్రంగా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత చిత్రంగా రూ.374.43 కోట్ల వసూళ్లతో అమీర్ ఖాన్ నటించిన చిత్రం ‘దంగల్’ ఉండేది. కానీ రాకీబాయ్ హవాతో అమార్ ఖాన్ దంగల్ చిత్రం కాస్తా వెనక్కి వెళ్లింది. కేవలం మూడు వారాల్లో కేజీఎఫ్ 2 రూ.391 కోట్లతో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్లాక్ బాస్టర్ చిత్రం నార్త్ లో రూ.400 కోట్ల రీచ్ కు అతి సమీపంలో ఉంది. 

ప్రస్తుతం నార్త్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న చిత్రాలు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’, ‘ఆర్ఆర్ఆర్’. ఈ రెండు చిత్రాలు ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతున్నాయి. ఆర్ఆర్ఆర్ ను మించి కేజీఎఫ్ దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరి హిస్టరీ క్రియేట్ చేసిన తొలి కన్నడ చిత్రంగా పేరొందింది. ఈ మార్క్ తో ప్రపంచ వ్యాప్తంగా హ్యయేస్ట్ గ్రాసింగ్ నాల్గో ఇండియన్ ఫిల్మ్ గా ఈ యాక్షన్ మూవీ చోటు సంపాదించుకుంది. RRR మూడో స్థానంలో ఉంది. 
 
దర్శకుడు ప్రశంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా కన్నడ సూపర్ స్టార్ యష్, గ్లామర్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటించారు. కీలకపాత్రల్లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ నటించారు. హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూ.100 కోట్లతో నిర్మాత విజయ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి