సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, సీనియర్ నటుడు పూజపుర రవి కన్నుమూత

Published : Jun 19, 2023, 07:10 PM IST
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, సీనియర్ నటుడు పూజపుర రవి కన్నుమూత

సారాంశం

సినీ పరిశ్రమను వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా సౌత్ లో చాలా మంది పేరున్న తారలు ఈలోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో తాజాగామలయాళ సీనియర్ నటుడు పూజపుర రవి కన్నుమూశారు. 


ఫిల్మ్  ఇండస్ట్రీ వరుస విషాదాలతో మూనిగిపోయింది. ఒకరి తరువాత మరొకరు తారలు కన్నుమూస్తుండటంతో.. ఇండస్ట్రీలో విషాద చాయలు అలముకున్నాయి. గల నెలలో ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆతరువాత సంగీత దర్శకుడు రాజ్, తాజాగా టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్  మరణం దిగ్బ్రాంతికి గురిచేసింది.  బాలీవుడ్ లో వరుసగా బుల్లితెర, వెండితెర నటులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 

ఇవన్నీ మరువక ముందే.. మాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు పూజపుర రవి కన్నుమూశారు. దాంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. మలయాళ సినీ పరిశ్రమలోని సీనియర్ నటులలో ఒకరైన పూజపుర రవి(83) ఆదివారం కన్నుమూశారు. వృద్దాప్యం సమస్యలతో బాధపడుతూ.. ఆయన కుమార్తె ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడిగా ఆయన జీవితం స్టార్ట్ అయ్యింది. ఆతరువాత  వెండితెర నటుడిగా పరిచయం అయ్యారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి .. వరుసగా సినిమాలు చేస్తూ... వెనక్కి తిరిగి చూసుకోలేదు రవి. ఆయన కెరీర్ లో  దాదాపు 800 కి పైగా సినిమాల్లో నటించారు. 

టోవినో థామస్ హీరోగా నటించిన గప్పీ రవికి చివరి సినిమా. ఆతరువాత ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరయూర్ లోని తన కుమార్తెతో ఉంటున్నట్లు తెలుస్తుంది. రవి మృతితో మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. స్టార్స్ అంతా ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు పూజపుర రవి మృతి పట్ల సంతాపం తెలిపారు. రంగస్థలం ద్వారా పూజపుర రవి ప్రజల మనసులను గెలుచుకున్నారని సీఎం అన్నారు. ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి రాష్ట్ర కళ, సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మంగళవారం పూజాపుర రవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సబ్యులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం
Ranabaali: పూనకాలు తెప్పించేలా విజయ్‌ దేవరకొండ `రణబాలి` టైటిల్ గ్లింప్స్, స్వాతంత్య్రానికి ముందు నాటి చీకటి కోణాలు