`రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి` ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌.. `అరి`పై అభిషేక్‌ బచ్చన్‌ గురి

Published : Feb 28, 2024, 11:30 PM ISTUpdated : Feb 28, 2024, 11:39 PM IST
`రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి` ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌.. `అరి`పై అభిషేక్‌ బచ్చన్‌ గురి

సారాంశం

`రాజుగారి అమ్మాయి నాయుడిగారి అబ్బాయి` మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేస్తుంది. మరోవైపు బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ `అరి`పై గురి పెట్టారు.   

`రాజుగారి అమ్మాయిపై నాయుడుగారి అబ్బాయి మనసు పడ్డాడు. ఈ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ అనూహ్యంగా రాజుగారి అమ్మాయి హత్యకు గురవుతుంది. అది చేసింది నాయుడిగారి అబ్బాయినే అని పోలీసులు వెంబడిస్తారు. మరి చనిపోయింది రాజుగారి అమ్మాయేనా, చంపింది నాయుడిగారి అబ్బాయేనా అందులోని మిస్టరీ ఏంటనేది `రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి` చిత్ర కథ. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ప్రధానంగా ఈ విషయాన్ని చూపించారు. సినిమాపై ఆసక్తిని పెంచారు.  

రవితేజ నున్నా, నేహా జురెల్‌ జంటగా నటిస్తున్న మూవీ `రాజుగారి అమ్మాయి, నాయుడుగారి అబ్బాయి`. సత్య రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో  ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించారు.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష స్పందన లభించింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బుధవారం ట్రైలర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. 

లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించిన తీరు కట్టిపడేసింది.

ఈ ట్రైలర్‌ ఈవెంట్‌లో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు మాడ్లాడుతూ టీమ్‌ అభినందనలు తెలిపారు. ట్రైలర్‌ బాగుందని, పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించే అన్ని కమర్షియల్‌ హంగులు ఇందులో ఉన్నాయని, మార్చి 9న విడుదలవుతున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని నిర్మాత ముత్యాల రామదాసు తెలిపారు. ఇందులో హీరో రవితేజ నున్నా, దర్శకుడు సత్యరాజ్‌ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.  

`అరి` సినిమా నుంచి వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్..

`పేపర్‌ బాయ్‌`తో దర్శకుడిగా మెప్పించారు జయశంకర్‌. మంచి కాన్సెప్ట్ చిత్రంతో వచ్చారు, ఆకట్టుకున్నారు. కొంత గ్యాప్‌తో ఇప్పుడు `అరి` మూవీతో వస్తున్నారు. అనసూయ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, సాయికుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.  

‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే