
అయితే దిల్ రాజుగారు ఆ కథ హీరో నానికి అయితే బాగుంటుందని చెప్పారు. దాంతో నేను ఓకే చెప్పి తప్పుకున్నాను. అలాగే ‘శతమానం భవతి’ కథ కూడా నాకు చెప్పారు. నాకు నచ్చింది. అయితే ఆ సినిమాను ఎట్టి పరిస్థితిల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, నేను ఆ సమయంలో వేరే మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. డేట్లు అడ్జెస్ట్ చేయడం కుదరలేదు.
అలా ఆ సినిమా నా చేజారింది. అంతే తప్ప నేను ఆ సినిమాలు రిజెక్ట్ చేయలేదు. అసలు దిల్ రాజుగారి సినిమాలు ఎలా రిజెక్ట్ చేస్తాను. త్వరలోనే ఆయన ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాన’ని రాజ్‌తరుణ్ చెప్పాడు.