లాల్ సలామ్ కి గుమ్మడికాయ కొట్టిన రజినీకాంత్!

Published : Jul 12, 2023, 03:56 PM IST
లాల్ సలామ్ కి గుమ్మడికాయ కొట్టిన రజినీకాంత్!

సారాంశం

కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది లాల్ సలామ్. ఈ మూవీ షూటింగ్ పై యూనిట్ అప్డేట్ ఇచ్చారు.   

చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్. ఆమె దర్శకత్వంలో లాల్ సలామ్ టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీలో రజినీకాంత్ క్యామియో రోల్ చేస్తున్నారు. మొయిద్దీన్ భాయ్ అనే పవర్ ఫుల్ రోల్ లో రజినీకాంత్ మెస్మరైజ్ చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయినట్లు యూనిట్ తెలియజేశారు. ఐశ్వర్య రాజేష్ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

తండ్రి రజనీకాంత్ తో పని చేయడం గొప్ప అనుభూతి అంటూ తన ఆనందం పంచుకున్నారు. లాల్ సలామ్ మూవీపై కోలీవుడ్ లో హైప్ నెలకొంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ లాల్ సలామ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరోవైపు రజినీకాంత్ జైలర్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. జైలర్ మూవీలో రజినీకాంత్ కి జంటగా తమన్నా నటిస్తుంది. ఇటీవల 'కావాలయ్యా' అనే మాస్ హై వోల్టేజ్ సాంగ్ విడుదల చేశారు. సదరు సాంగ్ లో తమన్నా లుక్, స్టెప్స్ మెస్మరైజ్ చేశాయి. జైలర్ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. జైలర్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?