
ఈ మధ్య సుమ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఫోటో షూట్స్, కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేశారు. సుమ ప్లేట్ లో వెజ్ ఐటెం ఉంది. అవన్నీ కొన్ని ఆకుల సమాహారం అని తెలుస్తుంది. సదరు ఫుడ్ ఐటెం ని ఉద్దేశిస్తూ... 'పుష్ప మూవీలో ఆకులు తింటది మేక... మేకను తింటుంది పులి అన్నారు. ఆకులు మేకలే కాదు మనుషులు కూడా తింటారని' కామెడీ చేశారు.
ఇంస్టాగ్రామ్ లో సుమ షేర్ చేసిన ఫన్నీ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఒకరు కామెంట్ చేయగా... ఆకులు మీకేనా మాకు కూడా పెట్టండి అంటూ మరొకరు కామెంట్ చేశారు. బుల్లితెర మీద సుమ సందడి తగ్గగా ఇలా సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ మధ్య సుమ షోలు తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. గతంలో సుమ ఎప్పుడూ అరడజనుకు పైగా షోలతో బిజీగా ఉండేవారు. ఆమెకు కూడా యాంకరింగ్ ఒకింత బోర్ కొట్టేసింది. అందుకే కొంచెం ఫ్రీ అయ్యారు. అలాగే ఆమె పిల్లల కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. సుమకు ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు రోషన్ కనకాల. అతన్ని హీరోగా ఇంట్రోడు చేయాలనేది సుమ కోరిక. ఆ ఏర్పాట్లలో ఉన్నారట.
ఇక సుమ కెరీర్ మొదలైంది నటిగా. హీరోయిన్ గా కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. ఈ మలయాళీ అమ్మాయి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ మధ్య మనస్పర్థలు తలెత్తాయి విడాకుల వరకూ వ్యవహారం వెళ్లిందని కామెంట్స్ వినిపించాయి. ఈ పుకార్లను సుమ దంపతులు తమదైన శైలిలో ఖండించారు.