రేపే అభిమానులతో రజనీ మీటింగ్‌.. పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ?

Published : Nov 29, 2020, 04:28 PM IST
రేపే అభిమానులతో రజనీ మీటింగ్‌.. పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ?

సారాంశం

చాలా రోజులుగా రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని రజనీ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. 

తమిళ రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఇక సినీ తారలు సైతం రాజకీయ ఎంట్రీకి సంబంధించి క్లారిటీ వస్తుంది. ఇప్పటికే విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తన పార్టీని ప్రకటించి ఏకంగా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నాడు. ఇప్పుడు రజనీ సైతం తన రాజకీయ ఎంట్రీకి సంబంధించిన కసరత్తలు షురూ చేస్తున్నారు. 

చాలా రోజులుగా రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని రజనీ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. రేపు నవంబర్‌ 30న అభిమాన సంఘాలకు చెందిన అధ్యక్షులతో మీటింగ్‌ నిర్వహించబోతున్నారు.

 చెన్నైలో ఈ మీటింగ్‌ సోమవారం ఉండబోతుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఈ మీటింగ్‌ ఉంటుందని, అనంతరం తన రాజకీయ ఎంట్రీపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సారైనా క్లారిటీ ఇస్తారా?ఇంకా సస్పెన్స్ ని కొనసాగిస్తారా? అన్నది మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం రజనీ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

దళపతి విజయ్ ప్లేస్ పై కన్నేసిన అల్లు అర్జున్ ? ఐకాన్ స్టార్ మాస్టర్ ప్లాన్ మూమూలుగా లేదుగా?
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్