తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

సింగర్‌ సునీత రెండో పెళ్ళికి ప్లాన్‌.. అతనెవరంటే?

Aithagoni Raju | Updated : Nov 29 2020, 03:49 PM IST

తెలుగులో పాపులర్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సింగర్‌ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతున్నారు. డిజిటల్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిని సునీత పెళ్ళి చేసుకోబోతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 

తెలుగులో పాపులర్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సింగర్‌ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతున్నారు. డిజిటల్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిని సునీత పెళ్ళి చేసుకోబోతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 

సునీతకి మొదట మీడియా రంగంలో పనిచేసే కిరణ్‌ కుమార్‌ గోపరాజుతో మ్యారేజ్‌ జరిగింది. తన 19వ ఏజ్‌లోనే మ్యారేజ్‌ చేసుకుంది సునీత. వీరికి ఓ కుమారుడు, కూతురు డా ఉన్నారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న మనస్పార్థాలు విడాకులకు దారితీశాయి. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సునీత ఇక మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని, అనేక విమర్శలకు చెక్‌ పెట్టాలని భావిస్తుందట.

అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ, ఒంటరిగానే ఉంటున్నట్టు, తనపై వస్తోన్న పుకార్లలో నిజం లేదని తెలిపింది. కానీ ఇప్పుడు మరోసారి ఆమె రెండో పెళ్ళి చేసుకోబోతుందనే వార్త వినిపించడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ఇక సునీత నటిగా, గాయనీగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!