సంక్రాంతి బరిలో రజనీకాంత్‌.. `లాల్‌ సలామ్‌` రిలీజ్‌ డేట్‌

Published : Oct 01, 2023, 06:13 PM IST
సంక్రాంతి బరిలో రజనీకాంత్‌..  `లాల్‌ సలామ్‌` రిలీజ్‌ డేట్‌

సారాంశం

ఆగస్ట్‌ లోనే `జైలర్`తో బాక్సాఫీసుని షేక్‌ చేశాడు రజనీకాంత్‌. ఇంకా ఆ ఊపు నుంచి ఆడియెన్స్ బయటకు రాలేదు. ఇప్పుడు సంక్రాంతికి టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్నాడు. 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. గత నెలలో `జైలర్‌`తో బ్లాక్ బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఇది కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా ఆరువందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. చాలా కాలం తర్వాత రజనీకి సరైన హిట్‌ పడింది. ఆయన రేంజ్‌ ఏంటో బాక్సాఫీసుకి చూపించింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు రెండు మూడు సినిమాలను లైనప్‌లో పెట్టారు రజనీ. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, `జై భీమ్‌` దర్శకుడు జ్ఞానవేల్‌తో మరో సినిమా చేయబోతున్నారు. ఇందులో ఏది మొదట ప్రారంభమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో సడెన్‌గా మరో సినిమాతో రాబోతున్నారు. రజనీకాంత్‌.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ రూపొందిస్తున్న `లాల్‌ సలార్‌` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌ డేట్ ని ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ వెల్లడించారు. ఇందులో  ముంబయి డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తుండ‌టం విశేషం. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు.

లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నట్లు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు `లాల్ సలాం`తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. 

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ `సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌గారితో మా అనుబంధం కొన‌సాగుతుండ‌టం మాకెంతో ఆనందంగానూ, గ‌ర్వంగానూ ఉంది. మా రిక్వెస్ట్ మేర‌కు ఆయ‌న ఈ చిత్రంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ  చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అని అన్నారు.

ఇదిలా ఉంటే సంక్రాంతికి భారీగా సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగులో నాలుగైదు సినిమాలున్నాయి. అటు కోలీవుడ్‌లోనూ భారీ చిత్రాలున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ ఇప్పుడు `లాల్‌ సలామ్‌` పోటీనివ్వబోతుంది. దీంతో సంక్రాంతి మరింత రణరంగంగా మారబోతుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా